తెలంగాణ వీణ , జాతీయం : హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు భారత సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని అజారుద్దీన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఓటర్ జాబితా వచ్చేసిందని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నియమించిన ఏకసభ్య కమిటి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపింది. అనంతరం విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది.