ప్రతి రోజూ ఆహారం పెట్టే వ్యక్తి మరణాన్ని ఒక కోతి తట్టుకోలేకపోయింది. ఆయన మృతదేహం వద్ద రోధించింది. మృతదేహం వెన్నంటే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రామ్‌కున్వర్ సింగ్ ప్రతి రోజూ ఒక కోతికి ఆహారం పెట్టేవాడు. రొట్టెలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి, కోతి మధ్య స్నేహం పెరిగింది. రోజులో కొంత సమయం ఆ కోతి అతడితో ఆడేది.
మంగళవారం రామ్‌కున్వర్ సింగ్ మరణించాడు. అయితే రోజు మాదిరిగా ఆహారం కోసం అక్కడకు వచ్చిన కోతి విగతజీవిగా ఉన్న అతడ్ని చూసి తట్టుకోలేకపోయింది. మృతదేహం వద్ద విలపించింది. అలాగే రామ్‌కున్వర్ అంతిమయాత్రతో పాటు 40 కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన అంత్యక్రియల్లో కూడా అది పాల్గొన్నది. అతడి మృతదేహాన్ని వీడలేక విలపించింది.