తెలంగాణ వీణ , హైదరాబాద్ : సంస్కృతి, సాంప్రదాయలకు.. ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. పూలపండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని చెప్పారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో జరుపుకునే ఈ గొప్ప పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.