తెలంగాణ వీణ , జేతీయం : వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని ఆ బామ్మ చాటిచెప్పింది. వయసు శరీరానికే కాని మనోధైర్యం, సంక్పలం ముందు అది చిన్నబోతుందని వెల్లడించింది. చికాగోకు చెందిన 104 ఏండ్ల డరోతీ హాఫ్నర్ విమానం నుంచి దూకి స్కైడైవ్ చేసిన అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సాధించింది. ఈ ఘటనకు సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పరిశీలన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
బామ్మ స్కైడైవింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్లిప్‌లో స్కైడైవ్ చేసేందుకు బామ్మ తన వాకర్‌ను పక్కనపెడుతుండటం కనిపిస్తుంది. ఆపై విమానంలోకి ఎంట్రీ ఇచ్చి గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో స్కైడైవింగ్‌కు పూనుకోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటో్ంది.