Saturday, December 28, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఇజ్రాయెల్‌ నుంచి ఢిల్లీకి నాలుగో ఫ్లైట్‌.. స్వదేశానికి మరో 274 మంది

Must read

తెలంగాణ వీణ , జాతీయం : హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ అజయ్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. తాజాగా నాలుగో విమానం ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఆ విమానంలో 274 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.
పాలస్తీనాలోని హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ ఇటీవల ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి పాల్పడింది. ఒకేసారి 5 వేల రాకెట్‌లను ప్రయోగించింది. ఈ దాడివల్ల ఇజ్రాయెల్‌లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రకటించి ప్రతిదాడులకు దిగింది. ఈ యుద్ధం రెండువైపులా వేల మందిని బలిగొంటున్నది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you