తెలంగాణ వీణ : ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇరువైపులా ఇప్పటి వరకు సామాన్య పౌరులు సహా 3 వేల మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ అధీనంలోని గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ యూనిటీ గవర్నమెంట్, వార్ క్యాబినెట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మరోవైపు, హమాస్ తీవ్రవాదుల దాడిలో 22 మంది అమెరికన్లు మరణించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సీనియర్ అధికారులతో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ నేడు సమావేశమయ్యే అవకాశం ఉంది.