తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పీడ్ పెంచారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు.
కాగా, తుమ్మల శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ.. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను. అరాచక, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి’ అని కామెంట్స్ చేశారు.