తెలంగాణ వీణ ,హైదరాబాద్ : రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మంత్రి తలసానికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌కు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, తాటికొండ రాజయ్య, మహిపాల్‌రెడ్డి, అబ్రహం తదితరులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాసర్‌రెడ్డి స్టేడియంలో మంత్రి తలసాని జన్మదిన వేడుకలు సందడిగా జరిగాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను మంత్రి కట్ చేశారు. ఈ వేడుకల్లో నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ కళాకారుల నృత్య, డాక్యుమెంటరీ ప్రదర్శనలు అలరించాయి.
లండన్‌లో బీఆర్‌ఎస్ ఎన్నారై యూకే యువజన నాయకుడు మధుయాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. తనపై ఇంతటి అభిమానం, ప్రేమను చూపుతున్న అభిమానులు, కార్యకర్తలకు జన్మజన్మలా రుణపడి ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. తన జన్మదినాన్ని పురసరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కేవీఆర్ స్టేడియం ఆవరణలో మొకను నాటిన అనంతరం మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎల్లవేళలా అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయా వేడుకల్లో సినీ నిర్మాతలు సీ కళ్యాణ్, చిన్నబాబు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర ప్రసాద్, సీనియర్ నటులు రఘుబాబు, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, బెవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, బీఆర్‌ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కార్యదర్శి రాజు, ఫిలిం ఎంప్లాయీస్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, లండన్‌లో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, వెంకట్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి కొంరెడ్డి, హరికృష్ణ కొండపల్లి, అన్నారెడ్డి రాయడి, ధీరజ్‌రెడ్డి కడారి, సాయి మద్దినేని తదితరులు పాల్గొన్నారు.