తెలంగాణ వీణ , జాతీయం : మధ్యప్రదేశ్‌లో ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల హామీలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఉచిత విద్య, విద్యార్థులకు నగదు పురస్కారాలు వంటి కాంగ్రెస్, ప్రియాంకా గాంధీ ఇచి్చన ఎన్నికల హామీలపై సీఎం చౌహాన్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో గాంధీ కుటుంబం ప్రతి ఒక్కరినీ మోసం చేసింది.
తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయదని స్పష్టం చేశారు. సీఎం చౌహాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రియాంకా గాంధీ సైతం విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీలో మాదిరిగా తమ పారీ్టలో నియంతృత్వానికి చోటులేదన్నారు. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఎందుకు నిలిపివేశారని సీఎం చౌహాన్‌ను ఆమె ప్రశ్నించారు.