తెలంగాణ వీణ , జాతీయం : తెలంగాణ రాష్ట్రాలకు గాను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో మధ్యప్రదేశ్‌లో 144 స్థానాలకు, ఛత్తీస్‌ఘఢ్‌లో 30 స్థానాలకు, తెలంగాణలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
తొలి జాబితాలో 30 ఎస్టీ కమ్యూనిటీ నియోజకవర్గాలకు, 22 ఎస్సీ సామాజికవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17న ఒకే దశలో జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటిస్తారు.
ఇక 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌ఘఢ్ విషయానికొస్తే.. తమ తొలి జాబితాలో భాగంగా 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ డియో తన కంచుకోట అయిన అంబికాపూర్ నుంచి బరిలో నిలిచారు.