తెలంగాణ వీణ , జాతీయం : భారత్‌ను ప్రపంచ గ్రోత్ ఇంజన్‌గా మార్చాలన్నదే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మన దేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘వైబ్రంట్ గుజరాత్’ తొలి శిఖరాగ్ర సదస్సుకు 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
20 సంవత్సరాల క్రితం వైబ్రంట్ గుజరాత్ అనే చిన్న విత్తనం నాటామని, ఇప్పుడు అది మహా వృక్షంగా ఎదిగిందని ఆనందం వ్యకం చేశారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గుజరాత్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదని, అలాంటి సమయంలోనూ వైబ్రంట్ గుజరాత్ సదస్సు విజయవంతమైందని చెప్పారు. గుజరాత్‌ను భారత్ గ్లోత్ ఇంజన్‌గా తీర్చిదిద్దడానికి ఈ సదస్సు నిర్వహించామని తెలియజేశారు. ఆనాటి కల వాస్తవ రూపం దాలి్చందన్నారు.
2014లో తనకు దేశసేవ చేసే అవకాశం వచి్చనప్పుడు భారత్‌ను గ్లోబల్ గ్లోత్ ఇంజన్‌గా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వెల్లడించారు. భారత్ త్వరలో గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌజ్‌గా మారే దశలో ప్రస్తుతం మనం ఉన్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతోపాటు నిపుణులు ఇదే మాట చెబుతున్నారని గుర్తుచేశారు. మరికొన్ని సంవత్సరాల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.
09