తెలంగాణ వీణ , సినిమా : సౌత్ ఇండియా హీరో విశాల్ CBFC పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డ్ వారు రూ.6.5 లక్షలు లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఇందుకు గాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకోసం ఒక సీనియర్ అధికారిని విచారించమని ముంబైకు కూడా పంపింది. అంతేకాకుండా CBFC వేధింపులకు ఎవరైనా గురై ఉండుంటే తగు సమాచారాన్ని తెలిపేందుకు [email protected]ను ఉపయోగించుకోవల్సిందిగా కేంద్ర సమాచార శాఖ తెలిపింది.ఈ విషయంపై తాజాగా హీరో విశాల్ స్పందించాడు. ‘కేంద్ర సమాచార, ప్రసార శాఖకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముంబైలో అవినీతి సమస్యకు సంబంధించిన ఈ ముఖ్యమైన విషయంపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాడం చాలా సంతోషం. నా ఫిర్యాదుపై వెంటనే స్పందించి తగు చర్యలు ప్రారంభించారు. మీకు చాలా ధన్యవాదాలు. లంచం తీసుకున్నవారిపై తప్పక తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా.. ఇదీ అవినీతిలో భాగమైన ప్రతి ప్రభుత్వ అధికారికి ఒక ఉదాహరణగా ఉంటుందని ఆశిస్తున్నాను