తెలంగాణ వీణ , సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘లియో’ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి అభిమానులను నిరాశపరిచింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మూవీ నుంచి వరుసగా అప్‌డేట్‌లను ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ఒక అప్‌డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ కు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘లియో’ సెకండ్ సింగిల్ బాడాస్ నేడు సాయంత్రం 6 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక సెకండ్ సింగిల్ కోసం అభిమానులు చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ సంభవం లోడింగ్.. అంటూ నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. మరోవైపు లియో నుంచి లాంఛ్ చేసిన నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
లియో మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను మొదట మలేషియాలో నిర్వహిస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే విదేశాల్లో ఈ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు విజయ్ నిరాకరించాడు. దీంతో ఆ ఈవెంట్‌ను తమిళనాడులో సెప్టెంబర్ 30న నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియో తెలిపింది. అయితే దీనికోసం టికెట్స్, పాసులను ఏర్పాటు చేసింది. అయితే ఈ పాసులకు అనుకున్నదానికంటే ఎక్కువ డిమాండ్ ఏర్పడడంతో చేసేదేమీ లేక ఆడియో లాంచ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.