తెలంగాణ వీణ , సినిమా : నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడం వంటి విజయవంతమైన చిత్రాల ఫేమ్ సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్ పతాకంపై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ కలిసి నటించిన ఇందులో నటి మహిమా నంబిరాయర్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించగా నిళల్‌గల్ రవి, జగన్ ముఖ్యపాత్రలు పోషించారు. కన్నన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 6న తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా రత్తం చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నిర్మాత టీజీ త్యాగరాజన్, అమ్మా క్రియేషన్స్ టి.శివ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధనుంజయన్ మాట్లాడుతూ దర్శకుడు సీఎస్ అముదమ్ తన గత చిత్రాలకు పూర్తిభిన్నంగా రత్తం చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని చెప్పారు.
విజయ్‌ఆంటోని మాట్లాడుతూ ఇది పాత్రికేయుల ఇతివృత్తంతో రూపొందిన కథా చిత్రం అని పేర్కొన్నారు. చిత్రం బాగా వచ్చిందని తనకు ఇందులో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అలాగే తన కూతురు మరణాన్ని తలుచుకుంటూ..‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. నేను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయాను. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నాను. బాధల నుంచే ఎంతో నేర్చుకున్నా’ అన్నారు.