తెలంగాణ వీణ , హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ తగ్గుతున్న ఆదరణ, కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. ఆ పార్టీ తరపున పోటీకి సోమారపు ఆసక్తి చూపుతుండగా, కార్యకర్తలు, అనుచరులు ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
మరోవైపు.. నామినేడ్ పోస్టు ఇస్తామని బీఆర్‌ఎస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సోమా రపు ఏ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై సోమా రపు సత్యనారాయణను ఫోన్‌లో సంప్రదించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేద న్నారు.