Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పూజాహెగ్డేకు మంచి రోజులు..

Must read

తెలంగాణ వీణ , సినిమా : మంగళూరు సోయగం పూజాహెగ్డేకు బ్యాడ్‌టైమ్‌ నడుస్తున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు ఒక్కసారిగా రేసులో వెనకబడింది. అయితే ఇది తాత్కాలిక విరామమేనని, త్వరలో తెలుగులో ఈ సొగసరి మూడు సినిమాలకు సైన్‌ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ప్రస్తుతం పూజాహెగ్డే కొన్ని కథల్ని వింటున్నది. త్వరలో తెలుగు చిత్రాన్ని ప్రకటిస్తుంది. తమిళం, హిందీ నుంచి కూడా ఆఫర్లొస్తున్నాయి.
ఓ తెలుగు ప్రొడక్షన్‌ హౌస్‌తో ఆమె మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ఈ వివరాలను వెల్లడిస్తాం. అనుకోని కారణాల వల్ల కొన్ని సినిమాలు మిస్సయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో తిరిగి ఆమెకు మంచి రోజులొస్తాయనే నమ్మకం ఉంది’ అని పూజా హెగ్డే సన్నిహిత వర్గాలు తెలిపాయి. మహేష్‌బాబు ‘గుంటూరు కారం’ నుంచి ఈ భామ తప్పుకోవడంతో ఆ స్థానంలో శ్రీలీలను కథానాయికగా తీసుకున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే హిందీ సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you