Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఏప్రిల్‌లో ప్రశాంత్‌నీల్‌, ఎన్టీఆర్‌ చిత్రం షురూ

Must read

తెలంగాణ వీణ , సినిమా : అగ్ర హీరో ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే భారీ వ్యయంతో హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా వుండగా..‘దేవర’ తర్వాత ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తాజా అప్‌డేట్‌ను అందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో ఎన్టీఆర్‌ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’ అని తెలిపారు. ‘దేవర’ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you