తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్‌ఎస్ అసమర్థ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పైనా అంతే అవిశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశపారంపర్య పార్టీలేనని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్ ట్వీట్ చేశారు.
ఆదివారం మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ నేతృత్వంలో జరిగే బహిరంగ సభలో తాను ప్రసంగించనున్నట్టు మోదీ తెలిపారు. అక్కడ రూ.13,500 కోట్లకుపైగా విలువైన రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వే, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.