తెలంగాణ వీణ , సినిమా : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి సింగ్ తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్ ను షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి వచ్చిన తొలి సినిమా ‘ఎల్‌జీఎం’ . ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్ హీరోగా నటించగా.. లవ్‌టుడే ఫేం ఇవానా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిచింది. రమేశ్ తమిళ్‌మని
కథనందిస్తూ దర్శకత్వం వహించాడు. జులై 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు సంబంధించి ఇంకా మేకర్స్ జత చేయలేదు.
కథలోకి వెళితే.. మీరాతో ప్రేమలో ఉన్న గౌతమ్.. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మతో కలిసి ఉండాలనుకుంటాడు. అయితే మీరాకు అలా ఉండటం ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరాకు, అమ్మకు మధ్య మంచి రిలేషన్‌షిప్ ఏర్పడేందుకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ వేస్తాడు గౌతమ్. మరి ఇవానా కాబోయే అత్తమ్మతో సౌకర్యవంతంగా ఫీలవుతుందా..? లేదా..? ఆ తర్వాత జరిగే కథేంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక లవ్‌టుడే సినిమాతో అందరి మనసు దోచేసిన ఇవానా ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచేసుకుంది. నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.