తెలంగాణ వీణ , సినిమా : పదేళ్ల కిందట వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. నాలుగేళ్లుగా ఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఏకంగా ధమ్ బిర్యానీయే పెట్టింది. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే.. తన అభిమాన హీరోను తెరపై ఎలా చూపిస్తాడో అనే దానికి ఒక ఎగ్‌జాంపుల్ క్రియేట్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు అదే కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతుందంటే పవన్ అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లోనే ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఏడాది కిందట ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ బైక్‌పై కళ్యాణ్ ఉన్న ఫోటోను రిలీజ్ చేసి వీళ్ల కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటన వచ్చింది.