తెలంగాణ వీణ , జాతీయం : అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో అటవీ శాఖ బృందంపై అడవి ఏనుగు దాడి చేయడంతో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… జోర్హాట్‌లోని టిటాబోర్‌లోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుండి బయటకు వచ్చినప్పుడు అటవీ శాఖ బృందం వాటిని తిరిగి అడవిలోకి తరిమికొట్టడానికి ప్రయత్నించింది.అదే టైంలో ఒక పెద్ద ఏనుగు అకస్మాత్తుగా అధికారులపై దాడి చేసింది. “అది మమ్మల్ని వెంబడించి, ప్రమాదవశాత్తు నేలపై పడిపోయిన అటవీ ఉద్యోగిని తన తొండంతో పట్టుకోగలిగింది” అని గాయపడిన అధికారి తెలిపారు. మరణించిన అటవీ ఉద్యోగిని మరియాని ఫారెస్ట్ రేంజ్‌లో ఫీల్డ్ డ్యూటీ అధికారి అతుల్ కలితాగా గుర్తించారు. అతని మృతదేహాన్ని శుక్రవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.