తెలంగాణ వీణ , హైదరాబాద్ : డ్రగ్స్ సంబంధిత కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున ఛండీగఢ్‌లోని సెక్టార్ 5లో ఉన్న ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రొపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా, అరెస్టు సందర్భంగా ఎమ్మెల్యే తీవ్రంగా ప్రతిఘటించారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాధానికి దిగారు. ఆ కేసును సుప్రిం కోర్టు ఎప్పుడో కొట్టేసిందని చెప్పారు.
ఖైరా పంజాబ్‌లోని భోలత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనపై 2015, మార్చి నెల జలాలాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసు నమోదుచేశారు. ఇదే కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అనంతరం వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వారిని దోషులుగా తేల్చారు.