తెలంగాణ వీణ , సినిమా : ప్రభాస్ ‘సలార్’ ఈ నెల 28న విడుదల కానున్నట్టు గతంలో ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. దీంతో ప్రభాస్ అభిమానులేకాక, సామాన్య ప్రేక్షకులు సైతం నిరాశకు లోనయ్యారు. దర్శక,నిర్మాతలు ప్రకటించే కొత్త డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు చిత్రయూనిట్ ‘సలార్’ విడుదల తేదీని ప్రకటించింది.
డిసెంబర్ 22న ప్రభాస్ ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఫ్’ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కేవలం 24 గంటల్లోనే 83 మిలియన్ల వ్యూవ్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి నిర్మాత: విజయ్ కిరంగదూర్.