తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీ సీఎం జగన్‌తో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అదానీ, అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.
సీఎంతో అదానీ పలు విషయాలపై చర్చించినట్టు తెలిసింది. వీరిద్దరి భేటీ పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నది. అదానీ గ్రూప్ ఏపీలోని కీలకమైన కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.