తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసింది.. కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణం. చంద్రబాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి’’ అని అనిల్ పేర్కొన్నారు.
‘‘చంద్రబాబుకు 23 లక్కీ నంబర్.. మా పార్టీకి చెందిన 23 మందిని లాక్కున్నాడు.. 2019లో ఆయనకి వచ్చిన సీట్లు 23.. జైలుకు వెళ్లిన డేట్ కూడా 23 యే.. చంద్రబాబు అరెస్ట్ పై సొంత పార్టీ నేతలే సైలెంట్‌గా ఉంటే.. మా పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువైంది’’ అని అనిల్ ఎద్దేవా చేశారు.
‘‘మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరు. తప్పు చేస్తే మా ప్రభుత్వంలో ఎంతటి వారికైనా జైలు జీవితం తప్పదు. ఏ వయస్సులో తప్పు చేసినా.. నేరం నేరమే.. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అనిల్ స్పష్టం చేశారు.