తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్
పిటిషన్‌పై హైకోర్టులో విచారణ అక్టోబర్ 3కి వాయిదా పడింది. ఈ కేసులో సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలకు కౌంటర్‌గా చంద్రబాబు
తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ అధికారులు కేసు
నమోదు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.
రాజధాని నగరానికి సంబంధించిన ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, రోడ్ల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే
ఆళ్వ రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 22న ఇచ్చిన ఫిర్యాదుతో అదే ఏడాది మే 9న సీఐడీ బాబుతోపాటు పలువురిపై కేసు నమోదు చేసింది.