తెలంగాణ వీణ , సినిమా : ఈరోజు రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘స్కంద’ విడుదలైంది. ఇందులో శ్రీలీల సాయి మంజ్రేకర్ ఇద్దరు కథానాయకురాలుగా చేశారు, చిట్టూరి శ్రీనివాస్ నిర్మాత. ఇది ఒక యాక్షన్ సినిమా, ఇందులో కథ ప్రకారం, కథానాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢీ కొంటాడు. శ్రీకాంత్ శరత్ లోహితాశ్వ అజయ్ పుర్కర్ , ప్రిన్స్, కాలకేయ ప్రభాకర్ ఇలా చాలామంది నటులు ఇందులో వున్నారు.
రామ్ పోతినేని మొదటి సారిగా బోయపాటి శ్రీను తో కలిసి చేసిన సినిమా ఈ ‘స్కంద’. ఈ సినిమా కోసం రామ్ పోతినేని చాలా కిలోలు బరువు పెరిగాడు కూడా. బోయపాటి సినిమాలో ఎటువంటి యాక్షన్ ఉంటుందని అనుకొని వస్తారో, ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇందులో యాక్షన్ సన్నివేశాలు. అలాగే రామ్ మంచి డాన్సర్ కూడా, ఇందులో యాక్షన్ తో పాటు, డాన్సులు కూడా బాగా చేసి చూపించాడు.
దగ్గుబాటి రాజా చాలా కాలం తరువాత మళ్ళీ ఇలా ‘స్కంద’ తెలుగు సినిమాలో కనపడతాడు. అతను రామ్ కి తండ్రిగా నటించాడు, అలాగే సీనియర్ నటి గౌతమి కూడా వుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తుంది అని బోయపాటి ఈ సినిమా చివర్లో చెప్పాడు. సినిమా అంతా అయిపోయాక, బోయాపాటి ఒక ఆసక్తికరమైన పాత్రని చివర్లో తెప్పించి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది, ‘స్కంద 2’ వస్తుంది అని చెప్పాడు. అందుకని ఈ సినిమాకి సీక్వెల్ వుంది, అయితే అది ఎప్పుడు అందులో ఎవరు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.