తెలంగాణ వీణ , క్రీడలు : చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరు కొనసాగుతున్నది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో (50 m rifle men’s 3P event) భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. స్వాప్నిల్, ఐష్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షెరన్ త్రయం మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ జట్టు 1796 పాయింట్లతో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఇప్పటి ఈ రికార్డు అమెరికా పేరుతో ఉన్నది. 2022లో జరిగిన క్యాట్ (CAT) చాంపియన్‌షిప్ పోటీల్లో అమెరికా నమోదుచేసిన 1761 పాయింట్లు ఇప్పటివరకు టాప్ స్కోర్‌గా ఉన్నది. 1763 పాయింట్లు, 1763 పాయింట్లతో దక్షిణ కొరియా జట్లు కాంస్యం, రజత పతకాలను సొంతం చేసుకున్నాయి.
అంతకుముందు ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం గెలుపొందింది. ఈశా సింగ్, పాలక్, దివ్యా సుబ్బారాజ్‌తో కూడిన జట్టు మొత్తం 1731 పాయింట్లు నమోదుచేసింది. ఇదే విభాగంలో 1736 పాయింట్లతో చైనా బంగారు పతకం, 1723 పాయింట్లతో చైనీ తైపీ రజతం కైవసం చేసుకున్నాయి.