.తెలంగాణ వీణ , క్రీడలు : ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ యువకెరటాల జైత్రయాత్ర కొనసాగుతోంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన చివరి గ్రూప్-డి మ్యాచ్‌లో భారత్ 4-1తో జర్మనీపై అద్భుత విజయం సాధించింది. దాంతో, గ్రూప్‌లో అగ్రస్థానం సాధించి పతకానికి అడుగు దూరంలో నిలిచారు.
మిక్స్‌డ్ డబుల్స్ పోటీల్లో సాత్విక రెడ్డి కనపురం, వైష్ణవి ఖడ్కేకర్ జోడీ 21-13, 23-21తో డేవిడ్ ఎకెర్లిన్, అమేలీ లెహ్మాన్ ద్వయాన్ని చిత్తు చేశారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 21-12, 21-7తో లూయిస్ పొంగ్రాట్జ్‌పై సునాయాసంగా గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో దుమ్మురేపిన ఉన్నతి హుడా 21-12, 12-11తో సెలిన్ హబ్స్‌ను ఓడించింది. మహిళల డబుల్స్‌లో వెన్నెల ,శ్రీయాన్షి సంచలన ప్రదర్శన కనబరిచారు