తెలంగాణ వీణ , సినిమా : అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్ ను షేక్ చేసిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను కబీర్ సింగ్ పేరిట హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ ను కూడా మెప్పించాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ ప్యాన్ ఇండియా చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ తోపాటు, రీసెంట్ గా విడుదల చేసిన అనిల్ కపూర్, మంధాన, బాబీ డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ రోజు రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో హీరో తండ్రి బల్బీర్ సింగ్ పాత్రలో అనిల్ కపూర్ నటిస్తుండగా, భార్య గీతాంజలిగా రష్మిక నటిస్తోంది.
నాకు తండ్రి కావాలని ఉంది అని హీరో అంటే.. మీ తండ్రిలాగా అయితే ఉండవు కదా అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ తో టీజర్ మొదలైంది. వయసుకొచ్చిన కొడుకును కొడుతూ.. క్రిమినల్ ను కన్నాం మనం అంటూ తండ్రి పాత్రలో అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా మా నాన్న ఈ ప్రపంచంలోనే బెస్ట్ అంటూ రణబీర్.. రష్మికతో చెప్పడం.. ధనవంతుల కుటుంబంలో పుట్టి చాలా సాఫ్ట్ గా ఉన్న అతను వయొలెంట్ గా మారి రక్తపాతం సృష్టించిన తీరును టీజర్ లో చూపెట్టారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్లను మరింత రక్తికట్టించేలా ఉంది. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.