తెలంగాణ వీణ , సినిమా : టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సినీ నటుడు, దర్శకుడు రవిబాబు తప్పుబట్టారు. ప్రజల సొమ్ము కోసం కక్కుర్త పడే రకం చంద్రబాబు కాదని అన్నారు. అనుక్షణం ప్రజల కోసం తపన పడే చంద్రబాబును ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడం సహజమేనని… అయితే, 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడో తనను అర్థం కావడం లేదని విమర్శించారు.